: బాబు అసత్య వాగ్దానాలతో రైతులు నాశనమయ్యారు: జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఓ రైతుతో తాను మాట్లాడుతున్న ఫోటోను జగన్ పోస్టుచేసి, దానికింద వ్యాఖ్యలు ఉంచారు. "చంద్రబాబు చెప్పిన అబద్ధాలతో ఇలాంటి రైతులు చాలా మంది నాశనమయ్యారు. అలాంటి రైతులు ఆశలు వదులుకోక ముందే వారి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది" అని జగన్ ట్వీట్ చేశారు.