: మహానాడులో సీనియర్ ఎమ్మెల్యే గౌతు శివాజీకి అవమానం


మహానాడులో తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గౌతు శివాజీకి అవమానం జరిగింది. లోపలికి వెళ్లనివ్వకుండా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మహనాడు వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేనని, మాజీ మంత్రినని, అయినా పోలీసులు తనను ఆపి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యేకు, పోలీసులకు చిన్న వాగ్వివాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి సర్ది చెప్పారు. పోలీసులు తెలియక అలా చేసుంటారని బుజ్జగించి ఆయనను లోపలికి తీసుకెళ్లారు. దాంతో ఆ విషయం సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News