: జయలలితపై పోటీ పెట్టడం లేదు: కరుణానిధి
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై పోటీకి తమ పార్టీ అభ్యర్థిని దించడం లేదని డీఎంకే అధినేత కరుణానిధి తెలిపారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, ఆర్కేనగర్ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని బరిలోకి దించకూడదని నిర్ణయించామని అన్నారు. కాగా, సీఎంగా ఎన్నికైన ఆరునెలల లోపు శాసనసభకు ఎన్నికవ్వాలన్న నిబంధన మేరకు, ఆర్కేనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వట్రివేల్ రాజీనామాతో ఖాళీ అయిన సీటులో జయలలిత పోటీ చేయనున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నేత, ప్రముఖ సినీ నటి ఖుష్బూ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.