: ఈ విషయంలో మోదీ, కేసీఆర్ లను మించినవారు లేరు: జైపాల్ రెడ్డి


అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లను మించినవారు లేరని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని మమ్మీని, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ను డమ్మీని చేసి పక్కన పెట్టేశారని అన్నారు. ఉద్యమం సమయంలో 'అవకాశాలన్నీ అమరవీరులు, ఉద్యమకారులకే' అని చెప్పిన కేసీఆర్, ఆ తరువాత వారిని పక్కన పెట్టేశారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ ఒకరిని మించి మరొకరు హామీలు ఇచ్చారని, అందులో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని ఆయన తెలిపారు. ప్రజలను మోసం చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో వీరిద్దరూ 'ఒకరిని మించినవారు మరొకర'ని ఆయన చెప్పారు. కాశ్మీర్ టెర్రరిస్టు మద్దతుదారులతో జతకట్టి దేశ భక్తిని ప్రధాని నిరూపించుకుంటే, తీవ్రవాద చర్యలకు మద్దతిచ్చే ఎంఐఎంతో కేసీఆర్ అంటకాగుతున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News