: సినీ నటిపై నిర్మాత అత్యాచారయత్నం... పోలీసులకు ఫిర్యాదు


షూటింగ్ పూర్తయిన తర్వాత తనతో మాట్లాడాలని నిర్మాత కుమార్ గెస్ట్ హౌస్ కు పిలిపించుకుని... అత్యాచారయత్నం చేశాడని ఓ కన్నడ సినీనటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి, కర్ణాటక రాష్ట్ర మహిళా మండలికి కూడా ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే, శివమొగ్గలో 'బిసిలు కుదురే' (వేడి గుర్రం) అనే షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో హీరో, హీరోయిన్ తో పాటు పలువురు నటీనటులు పాల్గొంటున్నారు. హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో బెంగుళూరుకు చెందిన ఓ నటి నటిస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత, నిర్మాత కుమార్ మాట్లాడాలంటూ తనను గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడని, వెళ్లిన తర్వాత అత్యాచారయత్నం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అనంతరం అక్కడ నుంచి బెంగళూరు చేరుకుని చలనచిత్ర వాణిజ్య మండలి, మహిళా మండలికి కూడా ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన భర్త సదరు నిర్మాతకు ఫోన్ చేస్తే... కేసు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

  • Loading...

More Telugu News