: బాబు ఏడాది పాలనపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం... 'అదిరిందయ్యా చంద్రం' పేరుతో సీడీ విడుదల


ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది పాలనపై ఏపీ కాంగ్రెస్ నేతలు కేవీపీ, రఘువీరా రెడ్డి, ఆనం రాం నారాయణరెడ్డి సీడీ విడుదల చేశారు. 'అదిరిందయ్యా చంద్రం' పేరుతో ఈ సీడీ విడుదలైంది. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రభుత్వం ఏర్పాటు చేశాక వైఫల్యాలను అందులో వివరించినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ రఘువీరా మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం ఒక్క వాగ్దానాన్నీ అమలుపర్చలేదన్నారు. టీడీపీ మహానాడు కాకుండా దగానాడు అని పెట్టుకుంటే బాగుండేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News