: ఉత్తరప్రదేశ్ ప్రేమికుల మరణ శిక్ష వారెంట్లు రద్దు
ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రేమికులు షబ్నం, సలీంలపై సెషన్స్ కోర్టు జారీ చేసిన మరణశిక్ష వారెంటులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. నిందితులు పెట్టుకునే రివ్యూ, మెర్సీ పిటిషన్ల కోసం ఎదురు చూడకుండానే డెత్ వారెంట్ పై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తొందరపాటుతో సంతకం చేశారని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఏప్రిల్ 15, 2008లో యూపీకి చెందిన షబ్నం అనే యువతి ప్రియుడు సలీంతో కలసి తన కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసింది. వారిలో పది నెలల పాప కూడా ఉంది. ఈ ఘటనపై నమోదైన కేసులో ప్రేమికులిద్దరికీ 2010లో మరణశిక్ష పడింది. ఈ తీర్పును 2013లో అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలో ఈ నెల 21న డెత్ వారెంట్ జారీ కావడంతో నిందితులు సుప్రీంకు వెళ్లగా, 25న కోర్టు స్టే విధించింది. తాజాగా వారెంట్లను రద్దు చేయడం గమనార్హం.