: మత్స్యకారులతో కలసి చేపల విందు ఆరగించిన రాహుల్
కేరళలో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ ఈ ఉదయం త్రిసూర్ సమీపంలోని మత్స్యకార గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో కలసి చేపల కూర, వేపుడులతో కూడిన విందు ఆరగించారు. ఈ విందు ఎంతో బాగుందని, మరోసారి ఇక్కడికి వచ్చి భోజనం చేస్తానని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏడాది ఎన్డీఏ పాలనపై రాహుల్ నిప్పులు చెరిగారు. మత్స్యకారులకు సముద్రం అమ్మ వంటిదని, ఆ అమ్మను సర్కారు లాగేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. బలవంతంగా భూములను లాక్కోవాలని మోదీ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.