: ఏపీ రాజధానిపై జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్... రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏకు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ, పట్టణాభివృద్ధి శాఖ, జలవనరుల శాఖ, పర్యావరణ శాఖలకు నోటీసులు జారీచేసింది. పంట భూముల్లో రాజధాని నిర్మాణం వల్ల ఆహార భద్రతకు ముప్పు కలుగుతుందని, కృష్ణా పరీవాహక ప్రాంతంలో రాజధాని పర్యావరణానికి నష్టం కలుగుతుందంటూ శ్రీమన్నారాయణ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. వెంటనే ట్రైబ్యునల్ విచారణకు స్వీకరించగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేయకుండా రాజధాని నిర్మించకూడదని అన్నారు. ఈ క్రమంలో తక్షణమే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తదుపరి విచారణను ట్రైబ్యునల్ జులై 27కు వాయిదా వేసింది.