: 2019 వరకు ఎరువుల ధరలు పెంచం: కేంద్ర మంత్రి హన్స్ రాజ్
ఎరువుల ధరలను 2019 వరకు పెంచబోమని కేంద్ర ఎరువులు, రసాయన శాఖల మంత్రి హన్స్ రాజ్ గంగారాం అహిర్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మూతపడిన ఎరువులు, రసాయనిక ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తామని తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదిలాబాద్ లోని నిర్మల్ లో 3 గంటలకు బహిరంగ సభ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఈరోజు మంత్రి ఆదిలాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలోని రామగుండం ఎఫ్ సీఐ, ఐడీపీఎల్ పరిశ్రమలను పునరుద్ధరిస్తామని చెప్పారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తున్నామని పేర్కొన్నారు.