: ట్విట్టర్ లో జెనీలియా, రితేశ్ ల కుమారుడి ఫోటో
సినీ నటి జెనీలియా, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ల కుమారుడు రియాన్ ఫోటోను తొలిసారి ట్విట్టర్ లో పెట్టారు. తండ్రి అయినప్పటి నుంచీ కొడుకు విషయాలను రితేశ్ ట్విట్టర్ లో తెలుపుతూనే ఉన్నాడు. ఈసారి మాత్రం తమ ముద్దుల తనయుడు రియాన్ ను మొదటిసారి బయటి ప్రపంచానికి చూపారు. ఆ ఫోటోల్లో చిరునవ్వులు చిందిస్తూ, ముద్దులొలుకుతూ కనిపిస్తున్న కుమారుడితో జెనీలియా దంపతులు సంతోషంగా కనిపించారు. ఇటీవలే తమ చిన్నారి ఏడవ నెలలోకి ప్రవేశించినట్టు చెప్పారు. రితేశ్ దేశ్ ముఖ్, జెనీలియాలు 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2014 నవంబర్ లో జెనీలియా చిన్నారికి జన్మనిచ్చింది.