: స్వలింగ సంపర్కులతో నిండిపోయిన మదార్సాలు: ముస్లిం ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్య
ముస్లింల విద్యా బోధనాలయాలుగా ఉన్న మదార్సాలు స్వలింగ సంపర్కులతో నిండిపోయాయని, వాటన్నింటినీ తక్షణం నిషేధించాలని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ ప్రొఫెసర్ వసీమ్ రజా వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది. వర్శిటీ హిస్టరీ విభాగంలో పనిచేస్తున్న వసీమ్ టీవీ చానళ్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపుతూ "మేము మదార్సాలను తొలగించాలని కోరుతున్నాం. అక్కడ విశృంఖల స్వలింగ సంపర్కం జరుగుతోంది. ఈ తరహా అసాంఘిక కార్యకలాపాల్లో మౌలానాల ప్రమేయం ఉంది" అని ఆరోపించారు. ముస్లిం యువత భవిష్యత్తు మారాలంటే దేశంలోని మదార్సాలను నిషేధించాలని ఆయన కోరారు. ఆయన వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు భగ్గుమంటున్నాయి.