: నారా లోకేష్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధం: పరిటాల శ్రీరామ్
దివంగత నేత పరిటాల రవి, ప్రస్తుత ఏపీ మంత్రి పరిటాల సునీతల కుమారుడు పరిటాల శ్రీరామ్ మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనకు మీడియా పలు ప్రశ్నలను సంధించింది. వాటికి స్పందించిన శ్రీరామ్... ప్రస్తుతం తన దృష్టి అంతా అనంతపురం జిల్లాలో టీడీపీని బలోపేతం చేయడంపైనే ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కానీ, లేక ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయాలనే విషయంపై ప్రస్తుతం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. రకరకాల వదంతులు వస్తుంటాయని... వాటిని పట్టించుకోవద్దని చెప్పారు. తమ యువనేత నారా లోకేష్ చాలా సమర్థుడని... ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తాను సిద్ధమని తెలిపారు. పార్టీ బలోపేతమే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు.