: పోలవరానికి ఇచ్చింది వంద కోట్లు కాదు... రూ.800 కోట్లు: పురంధేశ్వరి
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కేవలం వందకోట్లే ఇచ్చిందంటూ ప్రతిపక్షాలు పెదవి విరవడాన్ని, ఈ క్రమంలో వస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని ఆ పార్టీ నేత పురంధేశ్వరి ఖండించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చింది వందకాదని... రూ.800 కోట్లు అని ఆమె తెలిపారు. అలాగే ఏపీ రాజధానికి కేంద్రం రూ.8వేల కోట్లు ఇచ్చిందని ఆమె చెప్పారు. ఈ మేరకు కడపలో మీడియాతో మాట్లాడిన పురంధేశ్వరి, ఏపీ ప్రత్యేక హోదాకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.