: అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు వేడుకలు


తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు హైదరాబాదులోని గండిపేట ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' పాటతో పసుపు పండుగను ప్రారంభించారు. ఆ తర్వాత సభా వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం చంద్రబాబు, నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ, ఎల్.రమణ, కళా వెంకట్రావు తదిరులు జ్యోతి ప్రజ్వలన చేశారు.

  • Loading...

More Telugu News