: నేను బీఫ్ తింటాను... నన్నెవరైనా ఆపగలరా?: కేంద్ర మంత్రి రిజిజ్జు


ఇటీవల గోమాంసంపై నిషేధం విధించడం పలువురిని ఇబ్బంది కలిగించిందనే చెప్పాలి. అయితే గోమాంసం అంటే పడిచచ్చే వాళ్లు తినేందుకు పాకిస్థాన్ వెళ్లాలంటూ బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారి తీశాయి. ఇందుకు ప్రతిస్పందనగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజ్జు మాట్లాడుతూ, "నేను బీఫ్ తింటాను. అలాగని ఎవరైనా నన్నాపగలరా?" అంటూ ప్రశ్నించారు. అయితే హిందువులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోసంరక్షణపై విధించిన నిషేధానికి చట్టం చేయాలని కోరవచ్చు, కానీ బీఫ్ ఎక్కువగా తినే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నిషేధం విధించడం సరికాదని మంత్రి రిజిజ్జు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News