: మహానాడులో ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలి... సీపీఐ నారాయణ డిమాండ్

టీడీపీ నిర్వహిస్తున్న మహానాడులో ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి తీర్మానం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. లేదంటే టీడీపీ, దాని మిత్రపక్షం బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే అనుకోవాల్సి వస్తుందని అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. మహానాడులో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టీడీపీ పలు తీర్మానాలు చేయనుందని, ఈ క్రమంలో ప్రత్యేక హోదాపై కూడా తీర్మానం చేయాలని అన్నారు. తీర్మానం చేయకపోతే ఏపీ ప్రజలను టీడీపీ మోసం చేసినట్టే అని చెప్పారు.