: ఏ పదవికైనా లోకేష్ సమర్థుడే: మంత్రి దేవినేని ఉమ
హైదరాబాద్ లోని గండిపేటలో నేడు టీడీపీ మహానాడు అట్టహాసంగా ప్రారంభం అవుతోంది. ఈ సమయంలో అందరి దృష్టీ ఒకే అంశంపై కేంద్రీకృతమైంది. అదే పార్టీ యువనేత నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించే అంశం! మహానాడు ముగిసేలోగా కుమారుడు లోకేష్ కు పార్టీలో ఓ ముఖ్య పదవిని సీఎం చంద్రబాబు కట్టబెడతారంటున్నారు. దానిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును అడగ్గా.. లోకేష్ ఏ పదవికైనా సమర్థుడేనన్నారు. ప్రస్తుత కాలంలో ఓ శాసనసభ్యుడి కొడుకు శాసనసభ్యుడు కావాలని, ఇంజినీర్ కుమారుడు ఇంజినీర్ కావాలని, వైద్యుడి కుమారుడు వైద్యుడు కావాలని అనుకుంటున్నారని అన్నారు. అలాంటప్పుడు లోకేష్ కు కూడా పార్టీలో బాధ్యతలు అప్పగించడం తప్పు కాదన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సుముఖమేనని ఉమ పేర్కొన్నారు.