: మహానాడు ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ బోనమెత్తిన చంద్రబాబు


గండిపేటలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పండుగైన 'మహానాడు' కాసేపట్లో ప్రారంభంకానుంది. కాసేపటి క్రితమే పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. తమ అధినేతకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహానాడు ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ చంద్రబాబు బోనమెత్తారు. అధినేత రాకతో ప్రాంగణం సందడిగా మారింది. అనంతరం ఛాయాచిత్ర ప్రదర్శన, రక్తదాన శిబిరాలను ఆయన ప్రారంభించారు. కాసేపట్లో చంద్రబాబు టీడీపీ జెండాను ఆవిష్కరిస్తారు. దీంతో, మూడు రోజుల పసుపు పండుగ ప్రారంభమవుతుంది.

  • Loading...

More Telugu News