: పెళ్లిళ్లలో డ్యాన్సులు చెయ్యనంటున్న జాతీయ ఉత్తమ నటి
వివాహ వేడుకల్లో డ్యాన్సులు చేసి సంపాదించే డబ్బు తనకొద్దని ఈ సంవత్సరపు జాతీయ ఉత్తమ నటి కంగనా రౌనత్ అంటోంది. 'ఫెయిర్', 'నాట్ ఫెయిర్' అంటూ, అందం గురించి అవమానకరంగా మాట్లాడవద్దని కోరిన ఆమె, 'వారంలో రంగు మారిపోతుంది' అని ఊదరగొట్టే ప్రకటనలను ప్రభుత్వం నిషేధించాలని సూచించింది. తన తాజా చిత్రం 'తను వెడ్స్ మను' సీక్వెల్ విజయవంతంగా నడుస్తున్న తరుణంలో ఆమె మాట్లాడింది. తనకు ఇండస్ట్రీలో గుర్తింపు రావడానికి పదేళ్లు పట్టిందన్న ఆమె, తాను స్టేజ్ షోలు చెయ్యకపోవడం, అవార్డు ఫంక్షన్లకు, వివాహాల్లో నృత్యాలు చేసేందుకు వెళ్లకపోవడం దానికి కారణాలని తెలిపింది. అందువల్లే చాలా ఏజన్సీలు తనను పక్కన పెట్టాయని వివరించింది. తనకు ఇంగ్లీషు పెద్దగా రాకపోవడం కూడా ఇందుకు కారణమేనని వివరించింది.