: నోరూరించే వంటకాలతో సిద్ధమైన మహానాడు మెనూ!


తెలుగుదేశం 34వ మహానాడు వేడుకలకు హైదరాబాదులోని గండిపేట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా వస్తున్న తెలుగు తమ్ముళ్ల సందడి మధ్య మరికాసేపట్లో మహానాడు ప్రారంభం కానుంది. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాకు చెందిన 34 రకాల శాకాహార వంటకాలతో భోజనాలను సిద్ధం చేశారు. సుమారు 60 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఊహించిన సంఖ్య కన్నా ఎక్కువ మంది వచ్చినా, లేదనకుండా భోజనం పెట్టేలా యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. రాగి సంకటి, పచ్చి పులుసు, టమోటా పప్పు, సాంబారు, రసం, ఆలూ ఫ్రై, వంకాయ కూర, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, కందకూర, మామిడికాయ పచ్చడి, బొప్పాయి గారె, పెసర హల్వా, కరివేపాకు రైస్, పెరుగు చట్నీ, మిక్స్ డ్ వెజిటబుల్ కుర్మా, బెండకాయ కొబ్బరి వేపుడు, మిర్చి బజ్జీలు, పూతరేకులు తదితరాలతో కూడిన 24 రకాల వంటకాలతో తొలిరోజు మెనూను సిద్ధం చేశామని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు వివరించారు. రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మరో 10 రకాల వెరైటీలు అదనంగా చేయిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏర్పాట్ల కోసం 300 మంది పాకశాస్త్ర నిపుణులను నియమించగా, ఏర్పాట్లను లోకేష్ దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించడం విశేషం.

  • Loading...

More Telugu News