: అన్ని బోగీల్లోనూ దొంగలే... షిర్డీ - మైసూర్ రైల్లో భారీ దోపిడీ


ఎస్ 1 నుంచి ఎస్ 14 వరకూ అన్ని బోగీల్లో దోపిడీ దొంగలు చొరబడ్డారు. మొత్తం 30 మందికి పైగా దొంగలు రైలు మొత్తాన్నీ దోచేసుకున్నారు. ఎన్నడూ లేనట్టుగా మొత్తం 14 బోగీల్లోని ప్రయాణికుల నుంచి డబ్బు, నగదును అందిన కాడికి లాక్కున్నారు. ఈ ఘటన గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో షిర్డీ నుంచి మైసూరు బయలుదేరిన ఎక్స్ ప్రెస్ రైల్లో జరిగింది. మహారాష్ట్రలోని బాలాపూర్ వద్ద ఘటన చోటు చేసుకుంది. అన్ని రిజర్వేషన్ బోగీల్లో దుండగులు స్వైర విహారం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News