: నేడు, రేపు జాగ్రత్తగా ఉంటే చాలు!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నేడు, రేపు ఎండ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, శుక్రవారం నుంచి వేడి గాలుల తీవ్రత తగ్గిపోతుందని వాతావరణ శాఖ నిపుణులు వ్యాఖ్యానించారు. నెలాఖరుకు నైరుతీ రుతుపవనాలు కేరళను తాకనున్నాయని, ఆలోగానే 3 నుంచి 4 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. దక్షిణాదిలో రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. జూన్ 5 తరువాత తెలుగు రాష్ట్రాల వాతావరణం పూర్తిగా మారిపోతుందని అంచనా వేశారు.