: ఆ అంపైర్ ను వద్దన్న స్పెయిన్ బుల్
తాను సర్వీస్ చేసే సమయంలో అధిక సమయం తీసుకుంటున్నందుకు హెచ్చరించిన ఓ అంపైర్ ను ఇక తన మ్యాచ్ లకు నియమించవద్దని స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కోరాడట. ఈ విషయాన్ని నాదల్ కూడా స్పష్టం చేశాడు. అతనిపై తనకు వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకతా లేదని, తమకిద్దరికీ కొన్ని సమస్యలున్నందునే కార్లోస్ బెర్నార్డెన్ ను తన మ్యాచ్ లకు వద్దని చెప్పానని నాదల్ వివరించాడు. గతంలో రియోలో జరిగిన మ్యాచ్ లలో తన పట్ల బెర్నార్డెన్ అమర్యాదకరంగా వ్యవహరించినట్టు తెలిపాడు.