: ఐదుగురు నల్ల కుబేరుల పేర్లు వెల్లడించిన స్విస్ ప్రభుత్వం
భారత్ లోని నల్ల కుబేరుల్లో ఐదుగురి పేర్లను స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడించింది. స్విస్ ప్రభుత్వం వెల్లడించిన అధికారిక గెజిట్ లో ఐదుగురు భారతీయుల పేర్లు ఉండడం విశేషం. ప్రముఖ పారిశ్రామిక వేత్త యశ్ బిర్లా, ముంబైకి చెందిన గుర్జిత్ సింగ్ కొచర్, ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త రితికా శర్మ, ఇంకా, స్నేహలతా సహానీ, సంగీతా సహానీల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా, స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వారిలో కొన్ని దేశాల ఖాతాదారుల పేర్లను స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే వీరు ఎంత మొత్తంలో డబ్బు దాచుకున్నారు? అనే వివరాలను స్విస్ ప్రభుత్వం వెల్లడించకపోవడం విశేషం. వీరి పూర్తి వివరాలను బహిర్గతం చెయ్యకుండా ఉండాలంటే వీరు 30 రోజుల్లోగా ఎఫ్ టీఏ కోర్టుకు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది.