: 'సూట్ బూట్' సర్కార్ కి శుభాకాంక్షలు: రాహుల్ గాంధీ
'సూట్ బూట్' సర్కార్ కి శుభాకాంక్షలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఏడాది ముగిసిన సందర్భంగా రాహుల్ గాంధీ డిల్లీలో మాట్లాడుతూ, ఏడాది పాలనలో మోదీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు మాత్రమే ఉపయోగపడిందని అన్నారు. కేంద్రం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయన చెప్పారు. రైతులు, కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ గాంధీ వెల్లడించారు.