: మోదీ ఏడాది పాలనపై అమెరికా మీడియా విమర్శలు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది పాలనను అమెరికా మీడియా విమర్శనాత్మక దృష్టితో విశ్లేషించింది. మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యాచరణ అంతా ప్రచార పటాటోపమేనని వాల్ స్ట్రీట్ జర్నల్ తేల్చేసింది. అందమైన కల ముగిసిందని, సవాళ్లు ఎదురుచూస్తున్నాయని శీర్షిక పెట్టింది. ఇక, న్యూయార్క్ టైమ్స్ అయితే, మోదీ వాస్తవికతను తప్పనిసరిగా ఎదుర్కోవాలని పేర్కొంది. భారత్ లో విపక్ష నేతలు మోదీపై 'రైతు వ్యతిరేకి' అని, 'పేదల వ్యతిరేకి' అని ముద్ర వేశారని తెలిపింది. మించిన అంచనాల నడుమ భారత్ లో ఉద్యోగాభివృద్ధి నెమ్మదించిందని వివరించింది.

  • Loading...

More Telugu News