: ఢిల్లీ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేను గెంటేశారు!


ఢిల్లీ అసెంబ్లీలో నేడు వాడీవేడి వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మను మార్షల్స్ సాయంతో బయటికి పంపించివేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు కేంద్రం విశేషాధికారాలు ఇవ్వడంపై అసెంబ్లీలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా, శర్మ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో, గోయెల్... శర్మను సభ నుంచి బయటికి తీసుకెళ్లాలంటూ మార్షల్స్ ను ఆదేశించారు. శర్మ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. అంతకుముందు, శర్మ ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపైనా విరుచుకుపడ్డారు. కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను లాగేసుకుంటున్నారని లాంబా ఆరోపించడాన్ని శర్మ తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News