: స్మగ్లర్ మణి అణ్ణన్ కు రిమాండ్
ఎర్రచందనం స్మగ్లర్ మణి అణ్ణన్ కు కడప జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ వెంటనే పోలీసులు అతన్ని కడప ఉప కారాగారానికి తరలించారు. మరో స్మగ్లర్ బదానియా ఇచ్చిన సమాచారంతో కడప జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో మణిని అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్ తో కడపకు నిన్న రాత్రి తీసుకొచ్చి... ఈ సాయంత్రం కోర్టు ముందు హాజరుపరిచారు. ఇతనికి అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలున్నాయని కడప ఎస్పీ నవీన్ గులాటీ చెప్పిన సంగతి తెలిసిందే.