: మిస్టరీ వీడింది...అవి ఏలియన్స్ కాదట!


ముంబైలో నిన్న సాయంత్రం కలకలం రేపిన ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. అవి ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) కాదని, ఓ వజ్రాల సంస్థ ప్రచారం కోసం ఎగురవేసిన బెలూన్లని స్పష్టం చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గుర్తు తెలియని విహంగాలు ఎగురుతున్నట్టు జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ విమానాలకు చెందిన పైలట్లు గమనించారు. దీనిని కంట్రోల్ రూంకు తెలియజేశారు. వీటిని ముంబైవాసులు కూడా గమనించి ఏలియన్స్ గా భ్రమపడ్డారు. భద్రత పరమైన ఆందోళనతో పోలీసులు పూర్తి స్థాయిలో దీనిపై దర్యాప్తు చేపట్టారు. దీంతో అవి ఓ వజ్రాల కంపెనీ ఏర్పాటు చేసిన బెలూన్లని తేలింది. దీంతో ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఏలియన్ మిస్టరీ వీడింది.

  • Loading...

More Telugu News