: షారుక్ ట్విట్టర్ లో సల్మాన్ 'భజరంగి భాయిజాన్' ఫస్ట్ లుక్ విడుదల!


నటుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'భజరంగి భాయిజాన్' ఫస్ట్ లుక్ కొత్త రకంగా విడుదలైంది. మరో నటుడు షారుక్ ఖాన్ స్వయంగా ఆ ప్రచార చిత్రాన్ని తన ట్విట్టర్ వేదికగా విడుదల చేయడం విశేషం. ఈ సందర్భంగా "హీరోగా ఉండడం కంటే సోదరుడిగా ఉండడమే చాలా గొప్ప విషయమని నేను నమ్ముతున్నా. 'భాయిజాన్' చిత్రం 2015 ఈద్ కు విడుదల అవుతుంది. అందరికీ ఫస్ట్ లుక్ నచ్చిందా?" అని షారుక్ ట్వీట్ చేశాడు. గతంలో సల్మాన్, షారుక్ మధ్య విభేదాలు రావడంతో ఏళ్ల పాటు మాట్లాడుకోలేదు. కొన్ని నెలల కిందటే వారిద్దరు కలవడం, సల్మాన్ చెల్లి అర్పిత వివాహ వేడుకకు బాద్షా హాజరవడం కూడా జరిగింది. ఆశ్చర్యకరంగా సల్లూ నటించిన సినిమా పోస్టర్ కింగ్ ఖాన్ ద్వారా విడుదలవడం విశేషం. ఇదంతా చిత్ర ప్రచారంలో ఓ భాగం అనుకోవచ్చేమో!

  • Loading...

More Telugu News