: చీఫ్ ఇంజినీర్ ఉత్తర్వులపై మండిపడుతున్న ఏపీ ఇరిగేషన్ శాఖ సిబ్బంది
ఏపీ ఇరిగేషన్ శాఖ సిబ్బంది మొత్తం హైదరాబాద్ నుంచి విజయవాడ తరలివెళ్లాలని చీఫ్ ఇంజినీర్ ఇచ్చిన ఉత్తర్వులపై ఆ శాఖ సిబ్బంది మండిపడుతున్నారు. ఇన్ని వందల మంది ఇప్పటికిప్పుడు తరలివెళ్లాలంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. సరైన ఆఫీస్ లేకుండా, ఉండటానికి వసతి లేకుండా వెళ్లమంటే ఎలా వెళ్లేదని అంటున్నారు. విజయవాడకు గాని, కొత్త రాజధానికి గాని వెళ్లడానికి తామంతా సిద్ధమేనని... అయితే, ముందుగా మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు. ఈ ఉత్తర్వులతో తమ పిల్లల చదువులు కూడా దెబ్బతింటాయని అన్నారు. వసతులను కల్పించిన తర్వాతే తమను తరలించాలని విన్నవించారు.