: రోహిత్ ఎదిగాడు: సచిన్
ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మపై బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. నాయకుడిగా రోహిత్ ఎదిగాడని కితాబిచ్చాడు. అతను ఇప్పుడెంతో మెరుగైన కెప్టెన్ గా కనిపిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. ముంబై నాయకుడిగా ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసి, మరెన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రస్థానం సాగించాడని కొనియాడాడు. ఇలాంటి సవాళ్లే మంచి క్రికెటర్ గానూ, దృఢమైన వ్యక్తి గానూ మలుస్తాయని తెలిపారు. తాము రూపొందించిన వ్యూహాలను రోహిత్ మైదానంలో అద్భుతంగా అమలుచేశాడని సచిన్ అభినందించాడు. నాలుగ్గోడల మధ్య తాము చాలా ప్రణాళికలు రూపొందించినా, వాటిని విజయవంతం చేయాల్సింది కెప్టెనే అని, ఆ పనిని రోహిత్ అమోఘమైన రీతిలో నిర్వర్తించాడని వివరించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో ఫైనల్లో జట్టును ముందుండి నడిపించిన రోహిత్, అంతకుముందు వరుస పరాజయాలతో కుదేలైన జట్టును గెలుపుబాట పట్టించి, ఫైనల్ చేర్చాడు.