: 12 టవర్లు, 10,000 గదులు, 70 రెస్టారెంట్లు... అతి పెద్ద హోటల్ నిర్మిస్తున్న సౌదీ
సౌదీ అరేబియాలో 'అబ్రాజ్ కుడాయ్' పేరుతో ప్రపంచ అతి పెద్ద హోటల్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. సౌదీ ఆర్థిక శాఖ నిధులతో నిర్మితమయ్యే ఈ భారీ హోటల్ డిజైన్ ను దార్ అల్ హండ్సా గ్రూప్ రూపొందించింది. దీన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మక్కాలో నిర్మిస్తారు. 45 అంతస్తులు, 12 టవర్లు, 10,000 గదులు,70 రెస్టారెంట్లు, 4 హెలిపాడ్లతో కూడిన ఈ హోటల్ నిర్మాణానికి 3.5 బిలియన్ డాలర్లు (రూ.22,375 కోట్లు) వెచ్చిస్తున్నారు. 2017లో ఇది పూర్తవుతుందని భావిస్తున్నారు. కాగా, ఈ హోటల్ టవర్ల లోని 10 టవర్లలో 4 స్టార్ వసతి లభిస్తుంది. మిగిలిన 2 టవర్లలో 5 స్టార్ లగ్జరీ సదుపాయాలు ఉంటాయి. వార్షిక పవిత్ర యాత్రలో భాగంగా ప్రపంచదేశాల నుంచి మక్కాకు వచ్చే ముస్లింల వసతి కోసం ఈ హోటల్ నిర్మిస్తున్నారు.