: గుజ్జర్ల ఆందోళనలతో రైల్వేకు రోజుకు రూ.15 కోట్ల నష్టం


తమకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ సాధన కోసం రాజస్థాన్ లోని గుజ్జర్లు ఆందోళన కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరి ఆందోళనలతో పశ్చిమ రైల్వే తీవ్రంగా నష్టపోతోంది. రోజువారీ ఆదాయంలో సుమారు రూ. 15 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోందని అధికారులు తెలిపారు. భరత్ పూర్ జిల్లాలోని రైల్వే ట్రాక్ ను గుజ్జర్లు స్తంభింపజేశారు. దీంతో కీలకమైన ఢిల్లీ-ముంబై మార్గంలో గూడ్స్, రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ క్రమంలో పశ్చిమ రైల్వే ఆదాయానికి భారీగా గండి పడుతోంది.

  • Loading...

More Telugu News