: సల్మాన్ దుబాయ్ వెళ్లేందుకు బాంబే హైకోర్టు అనుమతి


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దుబాయ్ వెళ్లేందుకు బాంబే హైకోర్టు అనుమతి తెలిపింది. ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29న దుబాయ్ లో జరగనున్న ఓ షోలో సల్మాన్ పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో తన విదేశీ ప్రయాణానికి కోర్టు అంగీకారం కోరుతూ 21న సల్మాన్ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశాడు. దానిని పరిశీలించిన న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. హిట్ అండ్ రన్ కేసులో సల్లూ దోషిగా నిర్ధారణ అవడంతో బాంబే సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. తరువాత కొన్ని రోజులకే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లకూడదని, పాస్ పోర్టు అప్పగించాలని కోర్టు నిబంధన విధించిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News