: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి సమీరా రెడ్డి


బాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్రాల్లో నటించి, తన అందచందాలతో సినీ ప్రేక్షకులను మైమరపించిన ముద్దుగుమ్మ సమీరా రెడ్డి తల్లి అయింది. నిన్న ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వ్యాపారవేత్త అయిన అక్షయ్ వర్డేను 2014 జనవరిలో సమీరా పెళ్లాడింది. జై చిరంజీవ, అశోక్, కృష్ణం వందే జగద్గురుం, నరసింహుడు తదితర తెలుగు చిత్రాల్లో సమీరా రెడ్డి నటించింది.

  • Loading...

More Telugu News