: టీడీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఈసీని కలసిన ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా టీడీపీ ప్రభుత్వం నెరవేర్చలేదని... అందువల్ల టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కలసి హైదరాబాదులోని ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఈ క్రమంలో, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి భన్వర్ లాల్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం రఘువీరా మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో టీడీపీ యాడ్స్ ను ప్రదర్శించారు. యాడ్స్ లో చెప్పిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేక పోయిందని... ఈ నేపథ్యంలో, ఆ పార్టీకి రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని అన్నారు. హామీలను నెరవేర్చేంత వరకు ఆ పార్టీపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు.