: చేతనైతే సలహాలు ఇవ్వండి... లేకపోతే నోర్మూసుకుని కూర్చోండి: సోమిరెడ్డి ఫైర్
ఏపీ కాంగ్రెస్ నేతలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని అందరు అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయిన పార్టీగా కాంగ్రెస్ రికార్డ్ సృష్టించిందని విమర్శించారు. గత పదేళ్లలో జరిగిన అన్ని కుంభకోణాల్లో కాంగ్రెస్ నేతలకు సంబంధాలున్నాయని... వారందరికీ అవినీతితో కళ్లు మూసుకుపోయాయని ఆరోపించారు. లోకేష్ కుమారుడిపై కూడా విమర్శలు గుప్పించే దౌర్భాగ్య స్థితికి కాంగ్రెస్ వస్తుందని ఆరోపించారు. మా ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ కానీ, చంద్రబాబు కానీ ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని, వారి కుటుంబ సభ్యులను కూడా అవినీతికి దూరంగా ఉంచారని చెప్పారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతలు చేతనైతే మెరుగైన పాలన కోసం సలహాలు ఇవ్వాలని, లేకపోతే నోర్మూసుకుని కూర్చోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.