: పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడిని ఖండించిన గండ్ర
మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఆ పార్టీ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ఖండించారు. టీఆర్ఎస్ నేతల ఆగడాలు శృతిమించిపోతున్నాయని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను కంట్రోల్ లో పెట్టుకోవాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో గండ్ర మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధిని విస్మరించిందని వ్యాఖ్యానించారు. ఇక్కడి కళాక్షేత్రం ప్రకటనలకే పరిమితమైందని గుర్తు చేశారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.