: తెలంగాణ వారు ఏపీలో కలవాలనుకునే రోజు వస్తుంది: సోమిరెడ్డి
టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్త జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ లో కలవాలనుకునే రోజు వస్తుందని ఆయన అన్నారు. రాష్టం విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ పరిస్థితి మారే రోజు త్వరలోనే ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు తరలి వస్తున్నాయని సోమిరెడ్డి తెలిపారు. అధికారుల కారణంగా టీడీపీ కార్యకర్తలకు నష్టం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు.