: 'స్వచ్ఛ హైదరాబాద్'లో పాల్గొన్న రౌడీ షీటర్లు


'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో మాజీ రౌడీ షీటర్లు కూడా భాగస్వాములయ్యారు. నగరంలోని సంతోష్ నగర్ పరిధిలో ఉన్న 18 పోలీస్ స్టేషన్ లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్టేషన్ సిబ్బందితో పాటు దాదాపు 300 మంది రౌడీషీటర్లు పాల్గొన్నారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రం చేశారు. దక్షిణ జోన్ పోలీసులు వారిచేత ఈ కార్యక్రమం చేయించారు. సమాజ నిర్మాణంలెో భాగస్వాములం అవుతామని, ఇక నుంచి నేరాలకు పాల్పడమని రౌడీ షీటర్లు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పోలీసులు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News