: ఏపీకి ప్రత్యేక హోదాపై వెనక్కి వెళ్లం: అమిత్ షా
ఏపీకి ప్రత్యేక హోదా అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో, దీనిపై ఒక్కో నేత ఒక్కోలా మాట్లాడుతూ, అసలు ఏం జరగబోతోందో కూడా అర్థం కాకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక హోదాపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఈ మధ్యే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా చర్చించామని తెలిపారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.