: 'బోఫోర్స్' కుంభకోణమని ఎవరన్నారు?: ప్రణబ్ ముఖర్జీ


సుమారు 30 ఏళ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన 'బోఫోర్స్' శతఘ్నుల తేనెతుట్టెను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కదిలించారు. 'స్వదేశ్ నేషనల్ డైలీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'బోఫోర్స్' ఓ కుంభకోణం అని ఇండియాలోని ఏ న్యాయస్థానమూ నిర్ధారించలేదని గుర్తు చేశారు. బోఫోర్స్ ఒప్పందం 'స్కాం' అని మీడియాలో మాత్రమే వచ్చిందని ప్రణబ్ అన్నారు. కాగా, స్వీడన్‌ కు చెందిన హోవిట్జర్ తుపాకులను భారత సైన్యానికి అందించేందుకు 1986లో రూ. 1,600 కోట్ల విలువైన డీల్ ను కుదుర్చుకోగా, అందులో రూ. 64 కోట్లు ముడుపుల రూపంలో చేతులు మారినట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ కుంభకోణం దేశంలో సంచలనం రేపడంతో, 1989లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఖత్రోచీ, 2013 జులైలో ఇటలీలోని మిలాన్ నగరంలో మృతి చెందాడు.

  • Loading...

More Telugu News