: అమెరికాను భయపెట్టిన ఫ్రాన్స్ జెట్... రంగంలోకి దిగిన ఫైటర్ విమానాలు


అమెరికాపై బాంబులు వేసేందుకు ఓ ఫ్రాన్స్ జెట్ విమానం వస్తోందని ఫోన్ కాల్ వచ్చింది. ఈ విషయాన్ని అధికారులు వెంటనే ఎఫ్ బీఐకి వెల్లడించారు. దీన్ని ఎఫ్ బీఐ సైతం సీరియస్ గా తీసుకుంది. ఆ సమయంలో పారిస్ నుంచి న్యూయార్క్ కు ఓ పాసింజర్ జెట్ విమానం వస్తుండడంతో యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఈ రెండు ఎఫ్-15 విమానాలు గాల్లోకి ఎగిరి ఆ జెట్ వద్దకు వెళ్లి కాంటాక్టు పెట్టుకుని తక్షణం విమానాన్ని కిందకు దించాలని లేకుంటే పేల్చి వేస్తామని హెచ్చరించాయి. దీంతో ఆ జెట్ జెఎఫ్ కే ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఆ వెంటనే దాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎటువంటి బాంబులూ లేవని తేల్చడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఫోన్ కాల్ యూఎస్ నుంచే వచ్చినట్టు గుర్తించిన అధికారులు కాల్ చేసిన వ్యక్తి ఆచూకీ కోసం విచారణ మొదలుపెట్టారు. తొలుత ఎయిర్ ఫ్రాన్స్ విమానం పైలట్ తో కాంటాక్టు పెట్టుకునేందుకు ప్రయత్నించగా, స్పందన లేకపోవడంతోనే భయంతో యుద్ధ విమానాలను పంపాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News