: టోర్నడోల ఉగ్రరూపంతో వణికిపోయిన మెక్సికో
మెక్సికోను టోర్నడోలు మరోసారి వణికించాయి. ఉత్తర మెక్సికో ప్రాంతంపై విరుచుకుపడ్డ టోర్నడో 13 మంది ప్రాణాలను బలిగొంది. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని, చనిపోయిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. సియుడాడ్ యాకునా అనే పట్టణంపై సాయంత్రం 5.30 గంటల నుంచి 6.10 వరకు టోర్నడో ప్రభావం చూపిందని, 88 మంది తీవ్రంగా గాయపడగా, 229 చెట్లు నేల కూలాయని, 300 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనాయని తెలిపారు. మరో 1,500కు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలియజేశారు. బలమైన గాలుల కారణంగా, వాహనాలన్ని ఒక చోట కుప్పగా పడిపోయాయని, పరిస్థితి అత్యంత భయంకరంగా మారిందని వివరించారు.