: బాలికపై డిప్యూటీ తహసీల్దార్ పైశాచికం... చావగొట్టిన గ్రామస్తులు
అతని పేరు సురేష్. ఖమ్మం జిల్లా గుండాల మండలంలో డిప్యూటీ తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఎమ్మార్వో లేకపోవడంతో ఇన్ చార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. తన కుమారుడితో ఆడుకునేందుకు వచ్చిన ఓ 12 సంవత్సరాల బాలికపై లైంగిక వేధింపులకు దిగాడు. బాలిక కేకలు విని అక్కడకు చేరుకున్న గ్రామస్తులు, బాలిక తల్లిదండ్రులు సురేష్ ను చావగొట్టి పోలీసులకు అప్పగించారు. తాను తప్పు చేశానని అంగీకరించిన సురేష్, తనను క్షమించాలని మొరపెట్టుకున్నాడు. ఇటువంటి ఘోరమైన నేరాలు చేసే వారికి కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు, అతనిని పోలీసులకు అప్పగించారు. సురేష్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని, నేడు కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.