: బ్యూటీషియన్ ఉద్యోగాలంటూ అమ్మాయిలకు ఎరవేస్తున్న వ్యక్తి అరెస్ట్
బ్యూటీషియన్ ఉద్యోగాలు ఇస్తానని వివిధ పేపర్లలో ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ, అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న సయ్యద్ సలీం అనే వ్యక్తిని పోలీసులు కటకటాల వెనక్కు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బ్యూటీషియన్ ఉద్యోగాల పేరుతో సలీం యువతులకు ఎర వేస్తుంటాడు. అతనిచ్చిన ప్రకటనలపై ఆసక్తితో దరఖాస్తు చేసేవారిని ఇంటర్వ్యూలకు పిలిచి వారిని వేధించేవాడు. ఇతని బారినపడ్డ అమ్మాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అతడి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్టు వివరించారు.