: అనంతలో మార్నింగ్ వాక్ చేస్తున్న టీడీపీ నేత దారుణ హత్య
అనంతపురంలో మరోసారి ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. ఈ ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేత నారాయణస్వామిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఉరవకొండ షెక్సాన్ పల్లిలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నారాయణ స్వామి తలపై బండరాళ్లతో మోది హతమార్చారని సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని నారాయణ స్వామి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యపై తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.