: గేల్ పెళ్లికి పిలిచాడని ఎగిరి గంతేస్తున్న కుర్ర క్రికెటర్


సర్ఫరాజ్ ఖాన్... రెండు నెలల క్రితం ఎవరికీ తెలియని పేరు. ఈ పదిహేడేళ్ల కుర్ర క్రికెటర్ పేరు ఐపీఎల్ పుణ్యమాని దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఐపీఎల్ లో సర్ఫరాజ్ కొట్టిన షాట్లు చూసి దిగ్గజ క్రికెటర్లే ఫిదా అయ్యారు. ఐపీఎల్ ముగిసిన తరువాత కూడా సర్ఫరాజ్ ఇంకా ఆ లోకం నుంచి తిరిగిరాలేదు. క్రిస్ గేల్, ఏబీ డెవిలియర్స్, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకోవడంపై తన అనుభవాలను మిత్రులతో పంచుకుంటున్నాడు. వెస్టిండీస్ లో వచ్చే నెలలో జరిగే తన వివాహ వేడుకకు తప్పకుండా రావాలని క్రిస్ గేల్ ఆహ్వానించినట్టు చెబుతున్నాడు. వేలాది మంది "సర్ఫరాజ్... సర్ఫరాజ్" అని అంటుంటే, ఆ అరుపులు తనకు మళ్లీ మళ్లీ వినాలని ఉందని అన్నాడు. డెవిలియర్స్ తనకు ఎన్నో మంచి సూచనలు ఇచ్చాడని చెబుతున్నాడు. ప్రస్తుతం 80 కిలోల బరువున్న తాను వచ్చే సంవత్సరం వ్యవధిలో 6 కిలోల బరువు తగ్గాలని భావిస్తున్నట్టు తెలిపాడు.

  • Loading...

More Telugu News